Site icon NTV Telugu

Union minister Danve: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లో తీవ్రస్థాయిలో కులతత్వం..!

Union Minister Danve

Union Minister Danve

రాజకీయాలు, రాజకీయాల్లో కులతత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.. ఓ ట్రాన్స్ జెండర్ అయినా సరే, ఏ కులానికి చెందినవారెవరైనా సరే… అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే మహారాష్ట్రకు సీఎం అయిపోవ‌డం ఖాయ‌మంటూ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. జాల్నాలో పరశురామ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే… బ్రాహ్మణులను కేవలం కార్పొరేటర్ల గానో, పౌర సంఘాల నేతలు గానో చూడాలనుకోవడంలేదు. ఓ బ్రాహ్మణుడు మహారాష్ట్ర పాలనా పగ్గాలు చేపడితే చూడాలని ఉందన్నారు.

ఇక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేసినట్టు గుర్తుచేసుకున్న సాహెబ్‌ దాన్వే.. రాజకీయాల్లో కులతత్వం తీవ్రస్థాయిలో ఉన్న విషయం గుర్తించానని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లో ఉన్న కులతత్వాన్ని విస్మరించలేమన్నారు.. కానీ, సంఘాలను కలిపి నడిపించే నాయకుడు ఉండాలని సూచించారు..

Read Also: Congress Party: అనుమతి లేకున్నా రాహుల్‌గాంధీ ఓయూకు వెళ్తారా?

Exit mobile version