Site icon NTV Telugu

పలు రాష్ట్రాల సీఎంలతో షా భేటీ… 

టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.  ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది.  తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు.  ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు.  తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబోతున్నారు.  

Exit mobile version