కేంద్రస్థాయిలోని వివిధ ఎంట్రెన్స్‌లతో పాటు.. ఆయా రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలపై కూడా కీలకంగా చర్చించనున్నారు.. రేపు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రమేష్ పొక్రియాల్, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్ పాల్గొననున్నారు.. ముఖ్యంగా.. 12 వ తరగతి పరీక్షల నిర్వహణ, వివిధ ఎంట్రెన్స్ ల నిర్వహణ పై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.. కాగా, కోవిడ్ నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు, వివిధ జాతీయ స్థాయి ఎంట్రెన్స్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాలు కూడా.. స్థానిక పరిస్థితులను బట్టి పరీక్షలను వాయిదా వేస్తూనే ఉన్నాయి.
రాజ్‌నాథ్ అధ్యక్షతన కీలక భేటీ.. అన్ని ఎంట్రెన్స్‌లపై తేల్చేస్తారా..?
exams