NTV Telugu Site icon

Delhi: పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 2028 వరకు ఉచిత బియ్యం పంపిణీ

Unioncabinetkeydecision

Unioncabinetkeydecision

న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం కేంద్రం రూ. 17,082 కోట్లు కేటాయించింది. వంద శాతం కేంద్రం నిధులు కేటాయించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. అనంతరం అశ్విని వైష్ణవ్ వివరాలు మీడియాకు తెలియజేశారు. మహిళలు, పిల్లల్లో న్యూట్రిషన్ సమస్యలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్ల తెలిపారు.  80 కోట్ల మందికి న్యూట్రిషన్ సెక్యూరిటీ ద్వారా లబ్ధి పొందనున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Heroines: రూట్ మార్చిన హాట్ బ్యూటీస్… దెబ్బకు షేక్ చేస్తున్నారే!

 

ఇక 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం అందించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని కేంద్రం పొడిగించింది. 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

 

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..
రూ. 17,082 కోట్లతో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాకు ఆమోదం
ఐసీడీఎస్, పీఎం పోషన్ సహా అన్ని పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా
రక్త హీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యం
2024 జులై నుంచి 2028 డిసెంబర్ వరకు అమలు కానున్న పథకం
పూర్తిగా 100 శాతం కేంద్ర నిధులతోనే పథకం అమలు
దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రయోజనం
పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశం

నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయం
గుజరాత్‌లోని లోథల్ దగ్గర ఏర్పాటు కానున్న హెరిటేజ్ కాంప్లెక్స్
రూ. 4,406 కోట్లతో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సరిహద్దు రోడ్ల అభివృద్ధి
వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలీకాం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య అందించే ప్రయత్నం
2,280 కి.మీ మేర రాజస్థాన్, పంజాబ్‌లో కొత్త రోడ్ల నిర్మాణం
పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ
హైవేతో అనుసంధానం చేయడం ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు

 

Show comments