Site icon NTV Telugu

Delhi: పాన్‌ కార్డు 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. ప్రత్యేకత ఇదే!

Unioncabinet

Unioncabinet

ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Norway S*x Scandal: 87 మంది మహిళలపై అత్యాచారం.. బాధితుల్లో 14 ఏళ్ల బాలిక నుంచి 67ఏళ్ల వృద్ధురాలి వరకు..

పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్‌ కార్డు 2.0తో డిజిటల్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డుల పంపిణీ చేస్తామన్నారు. పేపర్‌లెస్‌, ఆన్‌లైన్‌ విధానంలో కొత్త పాన్‌కార్డు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ 2.0కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అటల్‌ పథకానికి 2,750 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వనుంది. వన్‌ నేషన్‌-వన్‌ సబ్‌స్ర్కిప్షన్‌ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్‌స్ర్కిప్షన్‌ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సౌరవిద్యుత్‌ కేంద్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ మిషన్‌ ఆఫ్ నేచురల్‌ ఫార్మింగ్‌కు ఆమోదం తెలిపింది.

Exit mobile version