ముహూర్తం ఖరారు.. రేపే కేబినెట్ విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.. రేపు సాయంత్రం 5.30 – 6 గంటల మధ్య కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది.. కనీసం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.. మొత్తంగా 20 మందికి పైగా కొత్తవారికి బెర్త్‌లు దక్కే అవకాశం ఉందని సమాచారం.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కొచ్చని చెబుతున్నారు.. కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు.. పాత మంత్రులకు షాక్ తప్పదనే ప్రచారం సాగుతోంది.. ఇక, కేబినెట్‌లో అవకాశం దక్కించుకున్నవారు.. వరుసగా బీజేపీ అధిష్టానాన్ని కలుస్తున్నట్టు తెలుస్తోంది..
ఈసారి విద్యాధికులు, ఎంబీఏ, పీజీ డిగ్రీలున్నవారికి, వృత్తి నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.. ఇతర వెనుకబడిన వర్గాలకూ అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.. గతంలో ఎన్నడూ లేని రీతిలో యువతకు ప్రాధాన్యత ఇవ్వనుండగా.. అన్ని రాష్ట్రాలకు, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాలనా అనుభవం ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తగిన సంఖ్యలో మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దినేష్ త్రివేది, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన జితిన్ ప్రసాదకు కూడా అవకాశం ఉందని సమాచారం.. నరేంద్ర మోడీ కేబినెట్‌లో జ్యోతిరాదిత్య సింధియా (మధ్య ప్రదేశ్), సర్బానంద సోనోవాల్ (అస్సాం), నారాయణ రాణే (మహారాష్ట్ర), అనుప్రియా పటేల్ (ఉత్తర్ ప్రదేశ్ ), పంకజ్ చౌధురి (ఉత్తర్ ప్రదేశ్), రీటా బహుగుణ జోషి (ఉత్తరప్రదేశ్), రామశంకర్ కథేరియా (ఉత్తరప్రదేశ్), వరుణ్ గాంధీ (ఉత్తరప్రదేశ్), పశుపతి పారస్ ( బీహార్), ఆర్‌సీపీ సింగ్ ( బీహార్), లల్లన్ సింగ్ ( బీహార్), రాహుల్ కశ్వన్ ( రాజస్థాన్), చంద్ర ప్రకాష్ జోషి (రాజస్థాన్), వైజయంత్ పాండా ( ఒడిశా), కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్) తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి..
Also Read
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
తాజావార్తలు
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!