Union Budget 2026: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. 7 హై-స్పీడ్ రైల్ కారిడార్‌లు ప్రకటన..

  • హైదరాబాద్‌కు గుడ్ న్యూస్..
  • 7 హై-స్పీడ్ కారిడార్‌లలో రెండు మనకే..
  • ముంబై, పూణే, బెంగళూర్, చెన్నై, సిలిగురి, వారణాసిలను కలుపుతూ నెట్వర్క్..
Rail Network

Rail Network

Union Budget 2026: బడ్జెట్‌లో మెరుగైన రైలు సౌకర్యాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. ఆదివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను కలిపే మూడు కారిడార్లు ఉండటం గమనార్హం. బడ్జెట్‌లో మెరుగైన రైలు సౌకర్యాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. ఆదివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తు్న్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా రెండు హై స్పీడ్ రైల్ కారిడార్లు ఉండటం గమనార్హం.

1.ముంబై–పుణే

×
×
Ad

2.హైదరాబాద్–బెంగళూరు

3.ఢిల్లీ–వారణాసి

4.వారణాసి–సిలిగురి

5.పుణే–హైదరాబాద్

6.హైదరాబాద్–చెన్నై

7.చెన్నై–బెంగళూరు

వేగవంతమైన, పర్యావరణపరంగా స్థిరమైన ప్రయాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏడు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రతిపాదిత కారిడార్లలో ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు, సుదూర ప్రాంతాల మధ్య కాలుష్య రహిత ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 12.2 లక్షల కోట్లతో మూలధన వ్యయాన్ని ప్రకటించారు. దీంట్లో భాగంగానే హై స్పీడ్ రైలు నెట్వర్క్ ప్రకటన వచ్చింది. వీటితో పాటు రాబోయే ఐదేళ్లలో కొత్తగా 22 జాతీయ జలమార్గాల నిర్వహణను ఆమె ప్రతిపాదించారు. తూర్పున డంకునిని పశ్చిమాన సూరత్‌తో కలిపే కొత్త అంకితమైన తూర్పు-పశ్చిమ సరుకు రవాణా కారిడార్‌ను ప్రకటించారు.