NTV Telugu Site icon

Uniform civil code: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లు.!

Parliament

Parliament

Uniform civil code: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ (యూసీసీ)పై భోపాల్ లో ఓ సభలో కామెంట్స్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి దీనిపై ప్రధానంగా వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూసీసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

Read Also: Jaggareddy: రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి భేటీ.. తెలంగాణ కాంగ్రెస్ పై చర్చ

వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘యూనిఫాం సివిల్ కోడ్’ బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును ముందుగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ అంశంపై లాకమిషన్, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వారి అభిప్రాయాలను తెలియజేయాలని జూన్ 14న నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు జూలై 3న లాకమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇందులో సభ్యుల అభిప్రాయాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, చట్టం, న్యాయం వంటి అంశాలు చర్చించబోతున్నారు. జూలై మూడో వారంలో జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో యూసీసీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం రెండు చట్టాలపై ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు యూసీసీకి మద్దతు ఇచ్చిందని, రాజ్యాంగం కూడా ప్రజలందరికి సమాన హక్కులు ఉండాలని చెబుతోందని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోడీ యూసీసీని తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేస్తుందని ఆరోపించింది.