NTV Telugu Site icon

Unemployment: దేశంలో 8 నెలల గరిష్టానికి నిరుద్యోగం.. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ..!

Jobless

Jobless

Unemployment: భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ(CMIE) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మే నెలలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి పెరిగిపోయిందని సీఎంఐఈ తెలిపింది. గత ఏడాది జూన్‌లో 8.5 శాతంగా నిరుద్యోగ రేటు ఉండగా.. ఈ జూన్‌లో 0.7 శాతం పెరిగిందన్నారు. ఇక, మహిళల్లో నిరుద్యోగం మరింత ఎక్కువగా ఉందన్నారు. గత ఏడాది జూన్‌లో 15.1 శాతంగా ఉన్న మహిళల నిరుద్యోగ రేటు ఈసారి జూన్‌లో 18.5 శాతానికి ఎక్కువైంది. కాగా, పురుషుల విషయానికి వస్తే.. గత ఏడాది జూన్‌లో 7.7 శాతంగా ఉండగా ఈ జూన్‌లో 7.8 శాతానికి పెరిగిందని ఈ సర్వేలో తేలింది.

Read Also: Hijbulla Attack : టాప్ కమాండర్ మృతికి ప్రతీకారం.. ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 200 రాకెట్ల ప్రయోగం

అయితే, గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ చేసిన సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూన్‌లో 9.3 శాతానికి పెరిగింది చెప్పుకొచ్చింది. గత ఏడాది జూన్‌లో 8.8 శాతం ఉండగా.. ఇప్పుడు 0.5 శాతానికి ఎగబాకింది. గ్రామీణ ప్రాంతా పురుషుల్లో నిరుద్యోగం మే నెలలో 5.4 శాతం ఉండగా జూన్‌లో 8.2 శాతానికి పెరిగిపోయిందన్నారు. గ్రామీణ మహిళల్లో 12.0 శాతం నుంచి 17.1 శాతానికి పెరిగిపోయిందని సీఎంఐఈ చెప్పుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుదల కాస్త తక్కువగా కనిపిస్తుందన్నారు. మే నెలలో 8.6 శాతం నిరుద్యోగ రేటు ఉండగా జూన్‌లో 8.9 శాతానికి మాత్రమే పెరిగింది.

Read Also: Success Story: ఉద్యోగం పోవడమే వరంగా మారింది.. దీప్ సింగ్ చీమా సక్సెస్‌ స్టోరీ..

ఇక, గ్రామీణ మహిళల కంటే పట్టణ మహిళల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు అని సీఎంఐఈ తేల్చింది. పట్టణ మహిళల్లో మే నెలలో 18.53 శాతంగా ఉన్న నిరుద్యోగం జూన్‌లో ఏకంగా 21.36 శాతానికి పెరిగిందని సర్వేలో చెప్పుకొచ్చింది. కాగా, కార్మిక భాగస్వామ్య రేటు(ఎల్‌పీఆర్‌) మేలో 40.8 శాతం, గత ఏడాది జూన్‌లో 39.9 శాతం ఉండగా ఈ జూన్‌లో మాత్రం 41.4 శాతానికి ఎక్కువైంది. 15 ఏళ్లు పైబడిన మొత్తం జనాభాలో ఉద్యోగం చేస్తున్నవారు.. చేయాలనుకుంటున్న వారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని కలిపి ఎల్‌పీఆర్‌గా లెక్కపెడతారు.