Site icon NTV Telugu

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. మహిళపై మామ అఘాయిత్యం.. బాధితురాలు ఆత్మహత్య

Rajasthan

Rajasthan

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల మహిళపై మామ అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజ్‌లోని తన బంధువుకు పంపాడు. దీంతో బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.

ఇది కూడా చదవండి: Hasini Sudhir: రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీ.. “పురుషోత్తముడు” హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజస్థాన్‌లోని చురులో 22 ఏళ్ల యువతిపై మామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీసి మరో బంధువుకు పంపించాడు. దీంతో బాధితురాలు ప్రాణాలు తీసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: UPSC Changes Exam Pattern: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ పరీక్షా విధానంలో కీలక మార్పులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ ఘటనను వీడియో రికార్డు చేసి మరో బంధువుకు పంపించాడు. దీంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మహిళ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రామ్‌గఢ్ ఎస్‌హెచ్‌ఓ పుష్పేంద్ర ఝఝరియా తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని, ఈ విషయమై తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Average Student Nani : ‘ఏమైందో మనసే’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు

Exit mobile version