Site icon NTV Telugu

Loan recovery: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక రైతు ఆత్మహత్య..

Tamil Nadu

Tamil Nadu

Loan recovery: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఒక రైతు బలయ్యాడు. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలవంతపు రికవరీ పద్ధతులను అరికట్టడానికి బిల్లును ఆమోదించిన రెండు రోజులకే ఈ మరణం సంభవించింది.

Read Also: Triple Talaq: ఫోన్‌లో “ట్రిపుల్ తలాక్” చెప్పిన భర్త.. భార్య ఆత్మహత్య..

జిల్లాలోని వళపడికి చెందిన తుక్కియంపాలయం నివాసి అయిన 55 ఏల్ల వడివేలు, తన భూమిని తాకట్టుపెట్టి ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి రూ. 4.80 లక్షల అప్పు తీసుకున్నాడు. ఏప్రిల్ 10న వాయిదా చెల్లించకపోవడంతో, మంగళవారం బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్లు వడివేలుని వేధించడం ప్రారంభించారు. బకాయి చెల్లించడానికి గడువు ఇవ్వడానికి కూడా నిరాకరించారు.

దీంతో వేధింపులు భరించలేక వడివేలు పురుగుల మందు తాగి మరణించినట్లు సమాచారం. రైతు మరణంతో గ్రామ ప్రజల్లో ఆగ్రహావేశాలు నెలకున్నాయి. న్యాయం కోరుతూ రైతు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత వజపాడి పోలీసులు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌ని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రైతు మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు అంగీకరించారు.

Exit mobile version