Site icon NTV Telugu

UK Professor: భారత వ్యతిరేక కార్యకలాపాలతో విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..

Uk

Uk

UK Professor: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ డైరెక్టర్, బ్రిటిష్- కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ యొక్క ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI)ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నానని, నా రచనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయనే సాకుతో భారత ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే, భారత ప్రభుత్వం తన ఓసీఐ స్టేటస్‌ను రద్దు చేయడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు ఆమె.

Read Also: Bengaluru: టెక్ సిటీనా? పల్లెటూర్‌నా? బెంగళూరు రోడ్లపై 50లక్షల నోటీసు

అయితే, భారతదేశ సార్వభౌమాధికార విషయాలపై, ఇండియన్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని వివిధ అంతర్జాతీయ వేదికలతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రొఫెసర్ నితాషా కౌల్ అనేక విద్వేషపూరిత రచనలు, ప్రసంగాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారత రాజ్యాంగాన్ని అవమానించడమే కాకుండ సొంత దేశంపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా రద్దు చేసినట్లు లండన్‌లోని భారత హైకమిషన్ వెల్లడించింది.

Exit mobile version