NTV Telugu Site icon

BJP On Rahul Gandhi: కాంగ్రెస్ నీచ వైఖరి బయటపడింది.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Rahul Gandhi

Rahul Gandhi

BJP On Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో మాత్రమే కాకుండా దేశంతో కూడా పోరాడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నీచమైన నిజం ఇప్పుడు బయటపడింది’’ అని అన్నారు. ప్రతిపక్షం దేశంతో పోరాడుతోందని అని భావిస్తే రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ ఎందుకు వెంట తీసుకెళ్లారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.

ఢిల్లీలోని కొత్త కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేశారు. ‘‘ఆర్ఎస్ఎస్ భావజాలం వంటి మా సిద్ధాంతం వేల ఏళ్ల పూరాతనమైంది. వేల ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ భావజాతంలో పోరాడుతోంది. మేము న్యాయమైన పోరాటం చేస్తున్నామని అనుకోకండి, ఇందులో న్యాయం లేదు. మనం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్‌తో పోరాడుతున్నామని మీరు నమ్మితే, ఏమి జరుగుతుందనేది మీకు అర్థం కాలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని సంస్థల్ని స్వాధీనం చేసుకున్నాయి. మనం ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తోనే కాకుండా భారతదేశంతో కూడా పోరాడుతున్నాము’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Read Also: Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..

బీజేపీ చీఫ్ నడ్డా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నీచమైన నిజం బయటపడింది, దేశానికి తెలిసిన విషయాన్నే ఆయన స్పష్టం చేసినందుకు అభినందిస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతదేశాన్ని కించపరిచేందుకు రాహుల్ గాంధీ ఆయన ఎకోసిస్టమ్, అర్బన్ నక్సల్స్, డీప్ స్టేట్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనేది రహస్యం కాదని, ఆయన పదేపదే ఈ విషయాన్ని బలపరుస్తున్నారని, రాహుల్ గాంధీ దేశాన్ని విభజించేందుకు, సమాజాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్నారని నడ్డా ఆరోపించారు. బలహీనమైన భారతదేశాన్ని కోరుకునే శక్తులను ప్రోత్సహించడం కాంగ్రెస్ నైజమని చెప్పారు.

అంతకుముందు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ… అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట తర్వాత దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆయనపై దేశద్రోహం పెట్టి, అరెస్ట్ చేసిన విచారిస్తానని అన్నారు. మరే దేశములో అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేస్తారని చెప్పారు.