NTV Telugu Site icon

UGC-NET: డార్క్‌నెట్‌లో యూజీసీ-నెట్ ప్రశ్నాపత్నం లీక్.. పరీక్ష రద్దు తర్వాత కేంద్రం ప్రకటన..

Ugc Net

Ugc Net

UGC-NET: యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నాపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు తేలిన నేపథ్యంలోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు. డార్క్ వెబ్, డార్క్‌నెట్ అనేది యూజర్లను గుర్తించలేని ఇంటర్నెట్‌లోని ఒక భాగం. డార్క్‌నెట్‌లోని UGC-NET ప్రశ్నపత్రం సరైన ప్రశ్నాపత్రంలో సరిపోతుందని స్పష్టంగా తెలిసిన వెంటనే పరీక్ష రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి చెప్పారు.

Read Also: iPhone 16 : ఐ ఫోన్ 16లో సిమ్ ఉండదు.. ప్రపంచమంతా ‘ఈ-సిమ్’ టెక్నాలజీ..!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) యూజీసీ-నెట్ పరీక్ష నిర్వహించిన ఒక రోజు తర్వాత బుధవారం పరీక్షను రద్దు చేశారు. జూన్ 18న జరిగిన పరీక్షలో పేపర్ లీక్ జరిగి ఉండొచ్చని ఎన్‌టీఏకి ఇన్‌పుట్స్ అందడంతో బుధవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జీరో ఎర్రర్ పరీక్షలను నిర్ధారించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఎన్టీఏ నిర్మాణాన్ని మెరుగుపరిచేందుకు, పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.