NTV Telugu Site icon

Maharashtra: ఒకే లిఫ్ట్‌లో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ‘‘సీక్రెట్ మీటింగ్’’..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒకేసారి ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అనుకోకుండా కలిశారు. అసెంబ్లీలో లిఫ్టు కోసం ఇద్దరు నేతలు ఎదురుచూస్తు్న్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇద్దరు పరస్పరం కొంతసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం గురించి ఉద్ధవ్ ఠాక్రేని ప్రశ్నించిన సందర్భంలో.. ‘‘ఇప్పటి నుంచి రహస్య సమావేశాలన్ని లిఫ్టులోనే చేస్తాం’’ అని సరదాగా అన్నారు.

ఫడ్నవీస్‌తో తాను లిఫ్టులో ఉన్నప్పుడు ప్రజలు ‘‘ నానా కర్తే ప్యార్ తుమ్హీ సే కర్ బైతే’’((1965 చిత్రం జబ్ జబ్ ఫూల్ ఖిలే సాంగ్, దీని అర్థం నన్ను ద్వేషించినా నిన్ను ప్రేమిస్తున్నాను) అని అనుకున్నారని, అయితే అలాంటిదేం లేదని, ఇది ఊహించని సమావేశం అని ఠాక్రే చెప్పారు.

Read Also: Pensions Distribution: కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. పెన్షన్ల పంపిణీపై కీలక ఆదేశాలు

బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌తో, ఠాక్రే మధ్య సంభాషణకు సంబంధించిన చిత్రాలు వెలువడ్డాయి. బీజేపీ నేత ఠాక్రేకి చాక్లెట్ బార్ ఇచ్చినప్పుడు, ‘‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’’ అని ఠాక్రే బదులిచ్చారు. ఎన్నికల ముందు మహారాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకునేందుకు బడ్జెట్ రూపొందిస్తున్నారని శివసేన యూబీటీ నేత ఠాక్రే చెప్పారు.

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి ఘోరంగా దెబ్బతింది. రాష్ట్రంలోని 48 ఎంపీ స్థానాల్లో 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్) కూటమి 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి.