Uddhav Thackeray comments on Sanjay Raut’s arrest: మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ అరెస్ట్ వ్యవహారం మరోసారి పొలిటికల్ గా చర్చకు దారి తీసింది. ఈడీ, బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంజయ్ రౌత్ అరెస్ట్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడిగా.. జర్మన్ నియంత హిట్లర్ పాలనతో పోల్చాడు. బీజేపీ పలు పార్టీలపై ఈడీ,సీబీఐలతో దాడులు చేయిస్తుందని.. ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. సంజయ్ రౌత్ ను చూసి గర్విస్తున్నట్లు ఉద్ధవ్ అన్నారు. ఈ వ్యవహారంపై శివసేన ఠాక్రే వర్గం కూడా పార్లమెంట్ లో సంజయ్ రౌత్ అరెస్ట్ ను లేవనెత్తింది. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది పార్లమెంట్ లో ప్రస్తావించారు. రాజకీయ ఎజెండా కోసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శించింది.
సంజయ్ రౌత్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని.. అతని చూసి గర్విస్తున్నానని.. బాల్ ఠాక్రే హర్డ్ కోర్ శివసైనికుడిగా సంజయ్ రౌత్ ను అభివర్ణించారు ఉద్దవ్. ‘పుష్ప’ సినిమాలో ‘ఝుకేగా నహీ’( తగ్గేది లేదు) అనే డైలాగ్ ఉందని.. అలా ఎవరికి తలొగ్గని వ్యక్తి సంజయ్ రౌత్ అని అన్నారు. బాలా సాహెబ్ నిజమైన శివసైనికుడు సంజయ్ రౌత్ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కానీ వంగను అని చెప్పుకునే వారు మాత్రం నేడు ఆ వైపు( ఏక్ నాథ్ షిండే) వైపు ఉన్నారని సెటైర్లు వేశారు.
Read Also: Monkeypox: కేరళలో 20 మంది క్వారంటైన్.. మరణించిన వ్యక్తితో సంబంధం
పత్రాచల్ భూముల స్కాం వ్యవహారంలో శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రౌత్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తుడిచిపెట్లేయలనే ఆలోచనలో బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. రౌత్ చేసిన నేరం బీజేపీ బెదిరింపులకు లొంగకపోవడమే అని.. అతను ధృడ విశ్వాసం, ధైర్యం కలిగిన వ్యక్తి అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేశారు.
