రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌గా పనిచేసే కన్హయ్య లాల్ దారుణహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకే ఆయనను కత్తులతో పాశవికంగా హత్య చేశారు. కాగా దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది. వెంటనే రంగంలోనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు దిగాయి. 24 గంటలు గడవక ముందే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అదుపులోనికి తీసుకుని జైలుకు తరలించారు. నిందితులైన రియాజ్, గౌస్ మహ్మద్‌లను విచారణలో భాగంగా జైపూర్‌లోని ఎన్‌ఐఏ కోర్టుకు తరలించారు.
Maharashtra: ఉదయ్‌పూర్ తరహాలో మహారాష్ట్రలో మరో హత్య.. నుపుర్ శర్మ పోస్ట్‌ను షేర్ చేసినందుకే!
ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే గుమిగూడిన ప్రజలు వీరిపై దాడికి పాల్పడ్డారు. న్యాయవాదులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్హయ్య హంతకులకు మరణశిక్ష విధించండి, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని పక్కకు లాగి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద వీరిని భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించారు. కాగా, కోర్టు ఈ నిందితులను జులై 12 వరకు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. ఉదయ్‌పూర్‌కు చెందిన కన్హయ్యలాల్‌ను పట్టపగలే ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమేగాక.. ప్రధానిని కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.
