Site icon NTV Telugu

Holi In Metro: మెట్రోలో హోలీ జరుపుకుని వైరల్ అయిన ఇద్దరు మహిళల అరెస్ట్..

Holi In Metro

Holi In Metro

Holi In Metro: హోలీ సందర్భంగా ఇద్దరు యువతులు ఢిల్లీ మెట్రోలో రంగులు చల్లుకోవడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో ఫుటేజీలో.. ఇద్దరు యువతులు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి, మెట్రో ట్రైన్ ఫ్లోర్‌పై కూర్చుని ఒకరి ముఖానికి ఒకరు రంగులు చల్లుకోవడం చూడవచ్చు. అయితే, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇద్దరు అమ్మాయిలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: West Bengal: బెంగళూర్ కేఫ్ పేలుడు కేసు.. బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ..

బహిరంగ ప్రదేశాల్లో కనీస మర్యాద, గౌరవాన్ని పాటించకుండా ఇలాగ జుగుప్సాకరమైన ప్రవర్తనకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో కార్పొరేషర్ వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, నెటిజన్లు డిమాండ్ చేశారు. మార్చి 21న ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు చేసిన రచ్చపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరు గ్రేటర్ నోయిడాకు చెందిన వారిగా తేలింది.

ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ నిబంధనలను ఉల్లంఘనపై, ఏప్రిల్ 8న నేతాజీ సుభాష్ ప్లేస్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళలపై IPC సెక్షన్ 294 (బహిరంగ ప్రదేశాలలో అసభ్యకర చర్యలు మరియు పాటలు) మరియు మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) చట్టంలోని సెక్షన్ 59 కింద కేసు నమోదు చేయబడింది. ఇప్పటికే ఇద్దరిపై రూ. 33,000 జరిమానా విధించారు. అయితే, జరిమానా చెల్లించేందుకు తగినంత డబ్బు లేదని ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు. అయితే, వారికి కొన్ని షరతులతో పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ మంజూరైంది. అరెస్ట్ వార్తపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు మహిళల చర్యల్ని వ్యతిరేకిగా.. మరొకొందరు వారిని సమర్థించారు. హోలీ వేడుక ప్రమాదకరం కాదని, అరెస్ట్ అనేది అతిచర్య అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Exit mobile version