Maharshtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మంజార్‌సంబా-పటోడా హైవేపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేజ్ తహసీల్‌లోని జివాచివాడి గ్రామానికి చెందిన ఒక కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో పుణెకు వెళ్తుండగా వారి వాహనం, టెంపో ఎదురెదురుగా ఢీకొన్నాయని పోలీసు అధికారి తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారి తెలిపారు. రెండు వాహనాలను వేరు చేసేందుకు పోలీసులు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Husband Stabbed Wife: కలిసి బతుకుదామన్నాడు.. కాసేపట్లోనే గొంతు కోసేశాడు
మాజీ ఎమ్మెల్సీ మృతి: మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ, శివసంగ్రామ్ పార్టీ నేత వినాయక్ మేటే(52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముంబై – పుణే ఎక్స్‌ప్రెస్‌పై ఆదివారం జరిగిన ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పో్యారు. రాయగఢ్ జిల్లాలోని రసాయని పోలీస్ స్టేషన్ పరిధిలోని మదప్ టన్నెల్ సమీపంలో ఉదయం 5.15 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. మేటే మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల కోసం మద్దతిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మేటే పుణె నుంచి ముంబయికి సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.ప్రమాదం స్థలంలో కారు చాలా దారుణంగా నుజ్జునుజ్జు అయిపోయింది. దీంతో కారులో ఉన్నవారందరికి తీవ్ర గాయాలపాలయ్యారు. వినాయక మేటే బీజేపీ మిత్రపక్షమైన శివసంగ్రామ్ చీఫ్‌గా కూడా పనిచేశారు. ఈ ప్రమాదంలో ఆయన భద్రత కోసం మోహరించి ఉన్న ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. మరఠ్వాడా ప్రాంతంలోని బీడ్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. ఆయన మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారు.
