మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలోని పితంపూర్‌లో రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా భారీ క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌పై క్రేన్ పడటంతో ఇద్దరు మరణించారు. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ట్రక్కులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.
ఇది కూడా చదవండి: Gujarat Video: కారుతో మైనర్ వీరంగం.. 3 ఏళ్ల చిన్నారిపై ఎక్కించి ఏం చేశాడంటే..!
ధార్ ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ మాట్లాడుతూ.. కుటి రోడ్‌లో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. పికప్ ట్రక్కును క్రేన్ ఢీకొట్టి బోల్తా పడిందని చెప్పారు. దీంతో ట్రక్కు లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపారు. మృతులను గుర్తించామని.. అభయ్ కుమార్, పర్మార్ అని తెలిపారు. పోస్టుమార్టం కోసం పంపించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఆ పాలనను 5 పదాల్లో చెప్పొచ్చు.. విపక్ష కూటమిపై మోడీ విసుర్లు
#WATCH Dhar, Madhya Pradesh: Two people have died after a crane fell on a truck at a railway bridge under construction. https://t.co/8WLRz9SY2c pic.twitter.com/MBnnPetxJA
— ANI (@ANI) October 30, 2025
#WATCH | Dhar, Madhya Pradesh: Two died after a crane fell on a truck at the construction site of a railway bridge.
Dhar ASP Parul Belapurkar says, "… During the construction of a railway overbridge on Kuti Road in the Sagar district, a tragic accident occurred where a pickup… pic.twitter.com/JZtNcfqE5K
— ANI (@ANI) October 30, 2025
