NTV Telugu Site icon

బీహార్ రైల్వే స్టేషన్ పేలుడు మూలాలు హైదరాబాద్ లో…

హైదరబాద్ లో మరోసారి ఉగ్రవాదుల మూలాలు బయటపడ్డాయి. ఈ నెల 17న బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. ఈ నెల 16న దర్భంగా రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ నుంచి పార్సెల్ వెళ్లినట్లు గుర్తించారు బీహార్ రైల్వే పోలీస్ & ఏటిఎస్ బృందం. బీహార్ దర్భన్ లో రైలు నుంచి ఓ వస్త్రాల పార్సిల్ దిగుతుండగా ఈ నెల 17న పేలుడు సంభవించింది. అనంతరం రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ.. పార్సిల్ చేసింది హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పేలుళ్లకు కారణమైన వస్త్రాల పార్సెల్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వచ్చినట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించింది ఏటిఎస్ బృందం.

అయితే సికింద్రాబాద్ కు కార్ లో పార్సెల్ చేసిన వారిని గుర్తించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ వారిని అదుపులోకి తీసుకొని బీహార్ వెళ్ళింది. వారిని విచారణ నిమిత్తం బీహార్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులకు అప్పగించింది ఏటిఎస్ బృందం.