Site icon NTV Telugu

grenade blast: ప్రమాదవశాత్తు పేలిన గ్రెనేడ్.. ఇద్దరు ఆర్మీ అధికారులు మృతి

Grenade Blast

Grenade Blast

grenade blast: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ప్రమాదవశాత్తూ గ్రెనేడ్ పేలడంతో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర్థరాత్రి పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లో ఈ దుర్ఘటన చేసుకుందన్నారు. రాత్రి నియంత్రణ రేఖ వెంబడి సైనికులు తమ విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రమాదవశాత్రు గ్రెనేడ్ పేలిందని.. ఈ పేలుడు కారణంగా ఇద్దరు సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయని ఢిఫెన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గాయాలపాలైన వారిని హెలికాప్టర్ ద్వారా ఉదంపూర్ ఆస్పత్రికి తరలించామన్నారు. వారు చికిత్స పొందుతూ ఆర్మీ కెప్టెన్‌తో పాటు నాయబ్‌ సుబేదార్‌(జేసీవో) మరణించారని వెల్లడించారు.

North Korea Rules : నార్త్‌ కొరియాలో రూల్స్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

మృతులు కెప్టెన్ ఆనంద్, నాయబ్ సుబేదార్ భగవాన్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ఆర్మీ దళాలు సంతాపం తెలిపాయి.

Exit mobile version