TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!
- తమిళనాడులో వీడిన రాజకీయ అనిశ్చితి
- విజయ్‌కు చిన్న పార్టీల మద్దతు
- మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకున్న విజయ్ బలం
- అయితే ఆసక్తిగా మారిన చిన్న పార్టీల షరతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. వామపక్షాలు, వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ చేరింది. 234 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 118కు చేరింది. దీంతో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
అయితే చిన్న పార్టీలు మద్దతు ప్రకటిస్తూనే ఆ పార్టీలు పెట్టిన షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే అన్నట్టుగా ఉంది. టీవీకే పార్టీకి కాంగ్రెస్ షరతు పెట్టింది. మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్ కండీషన్ విధించింది. ఇక సీపీఎం విషయానికొస్తే కేవలం సపోర్ట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక సీపీఐ బేషరతు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. అంటే కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు ప్రకటించాయి. అయితే కేబినెట్‌లో మాత్రం చేరడం లేదని వామపక్షాలు తెల్చి చెప్పాయి. ఇక వీసీకే విషయానికొస్తే… ఒక మంత్రి పదవితో పాటు తిరుచ్చి ఈస్ట్ తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావళన్ భావిస్తున్నారు. విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే విజయ్ పెరంబూర్‌ను ఉంచుకుని.. తిరుచ్చి ఈస్ట్ విడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్‌ను వీసీకే కోరుతోంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. టీవీకే 108, డీఎంకే 59, అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, ముస్లిం లీగ్ 2 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అయితే చిన్న పార్టీలు ఇప్పటి దాకా డీఎంకే కూటమిలో ఉన్నాయి. అయితే విజయ్ మద్దతు కోరగానే కాంగ్రెస్.. డీఎంకేతో చర్చించకుండానే మద్దతు ప్రకటించింది. అయితే గవర్నర్ అర్లేకర్.. మ్యాజిక్ ఫిగర్ చూపించపోవడంతో విజయ్‌కు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడడంతో వామపక్షాలు, వీసీకే విజయ్‌కు మద్దతు తెల్పాయి. దీంతో ఐదు రోజులుగా ఏర్పడిన ఉత్కంఠ వీడింది. ఇక విజయ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!