TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక
- టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ
- శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద శక్తిగా నిలిచించింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలోనే ఉంది. అయితే విజయ్‌కు మద్దతిచ్చేందుకు చిన్న పార్టీలు సన్నద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే చెన్నైలోని టీవీకే కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన తన పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా విజయ్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే.స్టాలిన్ రాజీనామా చేయగా.. గవర్నర్ ఆమోదించారు. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ లేఖ రాశారు. లేఖను రాజ్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా పంపించారు. లేఖలో రెండు వారాల్లోగా తమ పార్టీ మెజారిటీని నిరూపించుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్ చెన్నైలో లేకపోవడంతో రాగానే బుధవారం విజయ్ కలిసే అవకాశాలు ఉన్నాయి.
ఇక విజయ్ రెండు చోట్ల నుంచి విజయం సాధించారు. పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నుంచి గెలుపొందారు. పెరంబూర్‌లో 1,20,365 ఓట్ల మెజారిటీతో గెల్వగా.. తిరుచిరాపల్లి తూర్పులో 27,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే పెరంబూర్‌లో ఎక్కువ మెజార్టీ లభించడంతో ఈ సీటును నిలబెట్టుకుని.. మరో సీటును వదులుకోవాలని విజయ్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
#WATCH | Chennai, Tamil Nadu: TVK Chief Vijay leaves from the party office after holding a meeting with the party's winning MLAs
TVK won 108 out of 234 seats in the Tamil Nadu Assembly Elections, becoming the single-largest party. pic.twitter.com/0E6XJKwPY0
— ANI (@ANI) May 5, 2026
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!