Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదనుకుంటున్నావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Aadhav Arjuna vs Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్‌ను ఉద్దేశించి టీవీకే మంత్రి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి. డీఎంకేతో విసిగిపోయిన వారు ఇప్పుడు కొత్తగా వస్తున్నారని, కొందరు నటులు ఢిల్లీకి వెళ్లి మకాం వేస్తున్నారని ఆయన విమర్శించారు. పొంగల్ పండుగ సమయంలో ఏ నటుడు ఢిల్లీకి వెళ్లి కూర్చుంటున్నారో ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. తామంతా ఈ పరిణామాలను గమనిస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ రాజకీయ ఎత్తుగడలు వేస్తారని అధవ్ అర్జున అన్నారు. అయితే, ఎలాంటి వ్యూహాలు అనుసరించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బూత్ స్థాయిలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ఇక, తమ కూటమి మతపరమైన విభేదాలకు తావులేని సామాజిక న్యాయ కూటమి అని అధవ్ అర్జున పేర్కొన్నారు. తమ నాయకుడు విజయ్ అన్నతో పాటు కూటమిలోని నాయకులందరి కలయికే తమ బలమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా, వాటిని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
- Indian Curries in TasteAtlas Top 50: ప్రపంచంలోనే టాప్ 50 టేస్టీ కూరల్లో 8 భారత్‌వే.. సత్తా చాటిన ఇండియన్ వంటకాలు
- META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
ధనుష్‌ను ఉద్దేశించి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనలపై ఆయన సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, ఢిల్లీకి వెళ్తున్న నటుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నా.. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠగా మారిపోయింది..
తాజావార్తలు
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!