Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?

Aadhav Arjuna Vs Dhanush

Aadhav Arjuna Vs Dhanush

Minister Aadhav Arjuna vs Dhanush: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ను ఉద్దేశించి టీవీకే మంత్రి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. డీఎంకేతో విసిగిపోయిన వారు ఇప్పుడు కొత్తగా వస్తున్నారని, కొందరు నటులు ఢిల్లీకి వెళ్లి మకాం వేస్తున్నారని ఆయన విమర్శించారు. పొంగల్‌ పండుగ సమయంలో ఏ నటుడు ఢిల్లీకి వెళ్లి కూర్చుంటున్నారో ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. తామంతా ఈ పరిణామాలను గమనిస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ రాజకీయ ఎత్తుగడలు వేస్తారని అధవ్ అర్జున అన్నారు. అయితే, ఎలాంటి వ్యూహాలు అనుసరించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బూత్‌ స్థాయిలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ఇక, తమ కూటమి మతపరమైన విభేదాలకు తావులేని సామాజిక న్యాయ కూటమి అని అధవ్ అర్జున పేర్కొన్నారు. తమ నాయకుడు విజయ్ అన్నతో పాటు కూటమిలోని నాయకులందరి కలయికే తమ బలమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా, వాటిని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.

ధనుష్‌ను ఉద్దేశించి అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనలపై ఆయన సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, ఢిల్లీకి వెళ్తున్న నటుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నా.. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠగా మారిపోయింది..