Site icon NTV Telugu

TVK Chief Vijay: టీవీకే విజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ పార్టీ మనతోనే..!

Tvk

Tvk

TVK Chief Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న వేళ టీవీకే పార్టీ అధినేత విజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీని సీఎం ఎంకే స్టాలిన్‌ తన ఆధీనంలోకి తీసుకున్నారని విజయ్ విమర్శించారు. అయితే, నిజమైన కాంగ్రెస్ నేతలు తమతోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటముల్లో ఉన్న పార్టీలపై సెటైర్లు వేస్తూ, కూటమి భాగస్వాములు తమ ఓట్లను కూడా కాపాడుకోలేకపోతున్నారని విమర్శించారు.

Read Also: India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..

ఎన్నికల ముందు తనపై తీవ్ర కుట్రలు జరిగాయని విజయ్ ఆరోపించారు. ఎన్నికలకు సుమారు 30 రోజుల ముందు నుంచే తనను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాలుగా అణచివేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అయినప్పటికీ తనను ఎవరూ ఆపలేకపోయారని చెప్పుతూ, తలపై ఉన్న వెంట్రుకలను చూపిస్తూ వ్యంగ్యంగా స్పందించారు. తనపై రాజకీయంగా ఒత్తిడి తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక ఉన్న నిజాలు అందరికీ తెలుసని విజయ్ అన్నారు. అలాగే తన సినిమా జననాయగన్ విడుదలను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.

ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కూడా ఉపయోగించబడ్డారని విజయ్ విమర్శించారు. అయినప్పటికీ ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. చివరకు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించేందుకు తన భార్యతో విడాకుల అంశాన్ని బయటకు తెచ్చారని ఆరోపించారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు తనపై నమ్మకం కోల్పోలేదని, ఎప్పటికీ తనతోనే ఉన్నారని విజయ్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి.

Exit mobile version