Site icon NTV Telugu

Rupali Ganguly: బీజేపీలోకి ప్రముఖ నటి రూపాలీ గంగూలీ..

Rupali Ganguly

Rupali Ganguly

Rupali Ganguly: ప్రముఖ టీవీ నటి రూపాలీ గంగూలీ బీజేపీలో ఈ రోజు చేరారు. ‘‘అనుపమ’’, ‘‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’’ సిరీయళ్లలో నటించి ఫేమస్ అయిన రూపాలీ లోక్‌సభ ఎన్నికల మూడో దశకు ముందు బీజేపీలో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో బెంగాల్ నుంచి మెజారిటీ స్థానాలు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేకి ఇది కలిసొచ్చే పరిణామం. ఆమె చేరిక సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే‌తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Read Also: Congress: ఎవరూ భయపడొద్దు.. అమేథీ, రాయ్‌బరేలీపై 24 గంటల్లో నిర్ణయం..

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పనితీరుకు ఆకర్షితమైనట్లు ఆమె వెల్లడించారు. మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, అందులో భాగమయ్యేందుకు బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. తాను పీఎం మోడీ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నట్లు, ఏ పని అప్పగించినా ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. అమిత్ షా మార్గదర్శకత్వంలో, నేతలు, కార్యకర్తలు అందరూ గర్వపడేలా పనిచేస్తానని ఆమె చెప్పారు.

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు మరియా ఆలం ‘లవ్ జిహాద్’పై వ్యాఖ్యానించడాన్ని బీజేపీ తావ్డే విమర్శించారు. ఫరూఖాబాద్ ఎంపీ స్థానం నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న ఆమె మాట్లాడుతూ.. ఓటు జిహాద్ కోసం పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మైనారిటీ కమ్యూనిటీ బీజేపీని అధికారంలో దించడం అవసరమని అన్నారు. దీనిపై మాట్లాడిని తావ్డే.. ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఓటు జిహాద్ ప్రారంభియాని అన్నారు. ఒక వైపు ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీలు చెబుతూనే, ఓటు జిహాద్ కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Exit mobile version