Site icon NTV Telugu

Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితి..

Teacher Slaps Student

Teacher Slaps Student

Tuition Teacher: 9 ఏళ్ల బాలిక అల్లరి చేస్తుందని ట్యూషన్ టీచర్ కొట్టడం, బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలో ముంబైకి 58 కి.మీ దూరంలోని నల్లసోపరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక చెవి కింద టీచర్ రెండుసార్లు గట్టిగా చెంపదెబ్బ కొట్టడంతో బాలిక మెదడుకు తీవ్రగాయమైంది. ఈ సంఘటన అక్టోబర్ 05న జరిగింది. అప్పటి నుంచి విద్యార్థిని దీపిక ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. టీచర్ కొట్టిన వారం తర్వాత దీపిక ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఒక వారం తర్వాత ఆస్పత్రిలో చేర్చబడింది.

Read Also: Lover Suicide: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలు.. చచ్చిపోమని పురుగుల మందు కొనిచ్చిన ప్రియుడు.. చివరకు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల ప్రైవేట్ ట్యూషన్ టీచర్ రత్న సింగ్, క్లాసులో అల్లరి చేస్తుందని బాలిక చెంపపై కొట్టాడు. చెంపపై దాడి చేయడంతో బాలిక చెవిపోగులు చెంపకు గుచ్చుకున్నాయని పోలీసులు తెలిపారు. తొమ్మిదేళ్ల చిన్నారి మెదడుకు తీవ్రగాయం కావడం, దవడలు-మెడలు బిగుసుకుపోవడం, ధనుర్వాతం(టెటానస్) ఇన్ఫెక్షన్‌తో బాలిక ముంబైలోని సోమయ్యం ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చేరింది. గత 9 రోజులుగా బాలిక వెంటిలెటర్‌పై ఉంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీచర్‌కి నోటిసులిచ్చాం, విచారణ జరిపి, వైద్యులు అభిప్రాయం తీసుకుని చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారు.

Exit mobile version