NTV Telugu Site icon

Gautam Adani: “సత్యమేవ జయతే”.. సుప్రీం తీర్పుపై గౌతమ్ అదానీ హర్షం..

Adani

Adani

Gautam Adani: అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్ని విచారించిన సుప్రీం నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసి, ఈ రోజు తీర్పును వెలువరించింది. ఈ కేసును విచారించిన సెబీ అదానీ గ్రూప్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది. సెబీ విచారణను సుప్రీంకోర్టు సమర్థిస్తూ.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కి కేసు బదిలీ చేసేందుకు నిరాకరించింది.

Read Also: Bandi Sanjay: హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన

సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సత్యం గెలిచింది. గౌరవ సుప్రీంకోర్టు మరోసారి నిరూపించింది. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడిని. భారతదేశ వృద్ధిలో మా సహకారం కొనసాగుతుంది. జైహింద్’’ అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.

ఈ రోజు తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు… అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విచారణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) నివేదిక సెబీ నుంచి సిట్‌కి దర్యాప్తు బదిలీ చేయడానికి ప్రామాణికం కాదని తీర్పులో పేర్కొంది.