Site icon NTV Telugu

H-1B visa: భారతీయులకు గుడ్ న్యూస్.. H-1B వీసాపై వైట్‌హౌజ్ కీలక ప్రకటన..

H 1b Visa

H 1b Visa

H-1B visa: H-1B visa వీసాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో తీవ్ర ఆందోళన పెంచింది. వీసాల కోసం ఏకంగా USD 100,000 (రూ. 88 లక్షలు) చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికన్ డ్రీమ్ ఉన్న యువతను కంగారు పెట్టింది. ముఖ్యంగా, హెచ్1బీ వీసా కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం వైట్‌హౌజ్ భారతీయులకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. ఈ నిబంధనలు కొత్తగా H-1B వీసా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని, వారు మాత్రమే USD 100,000 కట్టాల్సి ఉంటుందని US పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సేవలు (USCIS) స్పష్టం చేసింది. సెప్టెంబర్ 21 లోపు దాఖలు చేసిన పిటిషన్లకు మినహాయింపు ఉంటుందని ప్రకటించింది.

Read Also: CM Revanth Reddy : ట్రంప్ H1B వీసా నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ ఏమన్నారంటే..?

ఈ రుసుమును దరఖాస్తుదారులు ఒకే సారి చెల్లింపు చేయాల్సి ఉంటుందని అమెరికా చెప్పింది. అయితే, కొత్త విధానం అమలులోకి వచ్చే ముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ‘‘ఇది వార్షిక రుసుము కాదు. ఇది వర్తించే వన్-టైమ్ రుసుము… కొత్త వీసాలకు మాత్రమే, పునరుద్ధరణలకు కాదు మరియు ప్రస్తుత వీసా హోల్డర్లకు కాదు’’ అని ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉన్న ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఆదివారం అమలులోకి వస్తోంది. ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్నవారు, దేశం బయట ఉన్నవారు, తిరిగి అమెరికాలోకి ప్రవేశించేందుకు $100,000 వసూలు చేయబడదు అని చెప్పారు. H-1B వీసాదారులు వేరే దేశం వెళ్లి తిరిగి, అమెరికాలోకి ప్రవేశించవచ్చని వెల్లడించారు.

అయితే, ట్రంప్ ఉత్తర్వులు ముఖ్యంగా భారతీయుల్లో గందరగోళాన్ని పెంచాయి. చాలా మంది అమెరికా నుంచి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారు, తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి టెక్ కంపెనీలు H-1B వీసాలు కలిగిన తమ ఉద్యోగుల్ని అమెరికా వదిలి వెళ్లవద్దని సూచించింది. వేరే దేశాల్లో ఉన్న వారు వెంటనే అమెరికా వచ్చేయాలని కోరింది.

Exit mobile version