NTV Telugu Site icon

Tripura CM Manik Saha: త్రిపుర సీఎం మాణిక్ సాహాకు కరోనా పాజిటివ్

Tripura Cm Manik Saha

Tripura Cm Manik Saha

Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా బుధవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. తనతో సంప్రదించిన వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.

Insta Reel at Metro Station: తగ్గేదెలే.. నిన్న మెట్రో బయట.. ఇవాళ ఏకంగా మెట్రోలోనే..

“ఈ రోజు నాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. ఎటువంటి లక్షణాలు లేకుండా బాగానే ఉన్నాను. నన్ను సంప్రదించిన వారందరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వినయంగా అభ్యర్థిస్తున్నాను.” అని మాణిక్ సాహా ట్విటర్ వేదికగా వెల్లడించారు. కరోనా టెస్ట్‌ రిపోర్ట్‌ను కూడా అందులో పోస్ట్‌ చేశారు. జులై 8న ముఖ్యమంత్రి త్రిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా (ఎమ్మెల్యే) ప్రమాణ స్వీకారం చేశారు.