NTV Telugu Site icon

Breaking: త్రిపుర సీఎం రాజీనామా.. బీజేపీ అధిష్టానం వేటు..?

Biplab Deb

Biplab Deb

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తన పదవికి రాజీనామా చేశారు.. వచ్చే ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.. తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించినట్లు తెలిపారు బిప్లబ్ కుమార్ దేబ్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి నేను పని చేయాలని పార్టీ కోరుకుంటోంది.. అందుకే సీఎం పదవికి రాజీనామా చేసినట్టు ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Sunil Jakhar: కాంగ్రెస్‌కి బిగ్‌ షాక్‌.. కీలక నేత గుడ్‌ బై.. గుడ్‌ లక్‌..!

అయితే, బీజేపీ రాష్ట్ర శాఖలో అంతర్గత పోరు నివేదికల నేపథ్యంలో బిప్లబ్‌ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, త్రిపురలోని బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కాబోతోంది.. తర్వాత సీఎం ఎవరు అనేది ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు.. శాసనసభా పక్ష నేత ఎన్నికకు పరిశీలకులుగా బీజేపీ సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డేలను నియమించింది అధిష్టానం.. ఇప్పటికే వీరు త్రిపురకు చేరుకున్నారు.. మరోవైపు, గత గురువారం ఢిల్లీ వెళ్లిన బిప్లబ్ కుమార్ దేబ్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. అంటే, రాజీనామా చేయాలనే అప్పుడే ఆయనకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది.. త్రిపుర పార్టీలో అంతర్గత కుమ్ములాటలే బిప్లవ్‌ దేవ్‌పై వేటు పడడానికి కారణంగా ప్రచారం సాగుతోంది. కాగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న జిష్ణు దేవ్‌ వర్మ త్రిపుర కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.