NTV Telugu Site icon

Kolkata Doctor Case: కోల్‌కతా ఆస్పత్రిపై దాడి తృణమూల్ గుండాల పనే.. బాధితురాలి న్యాయవాది..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు వస్తున్నా్యి. చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిదని బాధితురాలి తల్లిదండ్రులు ఇప్పటికే ఆరోపించారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసుని బదిలీ చేసింది.

ఇదిలా ఉంటే, గురువారం జరిగిన నిరసనల్లో కొందరు దుండగులు ఆస్పత్రిలోకి ప్రవేశించి, ఘటన జరిగిన ప్రాంతంలో విధ్వంసానికి దిగారు. ఈ విషయంలో కూడా కోల్‌కతా పోలీసులు వైఫల్యం చెందినట్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఈ దాడి వెనక మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉందని బాధితురాలి తల్లిదండ్రుల తరుపున కేసు వాదిస్తున్న లాయర్ బికాస్ రంజన్ భట్టాచార్య సంచలన ఆరోపణలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గుండాలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. నిరసనకారుల్ని భయపెట్టడం, చెదరగొట్టడంతో పాటు సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆస్పత్రిపై గుండాలు దాడి చేసినట్లు పేర్కొన్నారు.

Read Also: Minister Savitha: గుడ్‌న్యూస్‌.. ఏపీలో త్వరలో నూతన టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ

ఆస్పత్రిపై దాడిలో ప్రతిపక్షాలు బీజేపీ, సీపీఎంల ప్రమేయం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు 37 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో టీఎంసీ కార్యకర్తలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఘటనలో అరెస్టైన వారిలో 24 ఏళ్ల జిమ్ ట్రైనర్ కూడా ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు వైఫల్యాన్ని భట్టాచార్య వివరించారు. 31 ఏళ్ల వైద్యురాలు సెమినార్ హాలులో ఘటనకు గురైన తర్వాత, ఆస్పత్రి నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తె అనారోగ్యంతో ఉందని చెప్పారు, అరగంట తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఉన్నారు ఇది హత్యా.? ఆత్మహత్యా..? అని తెలియదా అని భట్టాచార్య ప్రశ్నించారు. పోలీసులు సరిగా విచారణ చేయలేదని చెప్పారు.

బాధితురాలి మృతదేహాన్ని మొదట్లో దహనం చేయాలనే ప్రయత్నం జరిగిందని చెప్పారు. ఎందుకంటే మృతదేహం కీలక సాక్ష్యంగా ఉంటుందని చెప్పారు. శవాన్ని కుటుంబ సభ్యులు దహనం చేయాలని పోలీసులు కోరారు. శవాన్ని ముందుగా దశనం చేయడమే వారి ప్రాథమిక ప్రయత్నమని ఆరోపించారు.