ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ, ఇంజనీర్ రహీద్‌పై దాడి జరిగింది. రషీద్‌పై ట్రాన్స్‌జెండర్ ఖైదీలు దాడి చేసినట్లుగా జైలు వర్గాలు తెలిపాయి. వాగ్వాదం తర్వాత రషీద్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని వేర్పాటువాదులు, ఉగ్రవాద గ్రూపులకు రషీద్ నిధులు సమకూర్చాడని రషీద్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రషీద్‌ను అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ
రషీద్‌పై దాడి జరిగినట్లు జైలు వర్గాలు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తన తండ్రికి రక్షణ కల్పించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు రషీద్ కుమారుడు అబ్రార్ రషీద్ లేఖ రాశాడు. తన తండ్రిని చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే రషీద్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. జైలు నెం.3లో ప్రస్తుతం ముగ్గురు ట్రాన్స్‌జెండర్ ఖైదీలు ఉన్నారు. వాగ్వాదం తర్వాత రషీద్‌పై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అయితే హత్యకు కుట్ర పన్నినట్లు వస్తున్న వార్తలను జైలు అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: Kethireddy Pedda Reddy: ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. 15 నెలల తర్వాత సొంత ఇంటికి..!
రషీద్ దాడి విషయంలో న్యాయవాదిని కలవబోతున్నట్లు అబ్రార్ రషీద్ తెలిపారు. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదని.. జైల్లో ఉన్న అందరి భద్రత గురించి అడుగుతున్నట్లు అబ్రార్ రషీద్ కోరారు. తన తండ్రి పార్లమెంట్ సభ్యుడని.. భద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. ఇక జైలు లోపల ఎలాంటి దాడి జరిగిందో వెల్లడించాలని అవామి ఇత్తెహాద్ పార్టీ డిమాండ్ చేసింది. జైల్లో కాశ్మీర్ ఖైదీలను-ట్రాన్స్‌జెండర్లు, గ్యాంగ్‌స్టర్లను ఒకే దగ్గర ఉంచడంతో కాశ్మీరీయులను వేధిస్తున్నారని.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. హెచ్‌ఐవీ ట్రాన్స్‌జెండర్లతో కలిసి ఉంచడమేంటి? అని ప్రశ్నించింది.
