మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని బారామణి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణా విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు బెంగళూరులో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ యాజమాన్యంలోని విమానం శిక్షణా పూర్తి చేసుకున్న తర్వాత ల్యాండ్‌కు సిద్ధపడుతుండగా టైర్లలో ఒకటి దెబ్బతిన్నట్లుగా గుర్తించాడు. దీంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో ముందు చక్రం ఊడిపోయింది. విమానం రన్‌వే నుంచి పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పైలట్ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భార్య, ఇద్దరి పిల్లల్ని చంపిన భర్త
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 270 మందికి పైగా చనిపోయారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికి ఎయిర్‌పోర్టు సమీపంలోని బిల్డింగ్‌పైన కూలిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తుండగా ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించింది. ప్రస్తుతం ప్రమాదంపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
महाराष्ट्र के बारामती में ट्रेनिंग एयरक्राफ्ट का लैंडिंग के समय लैंडिंग गियर में आई दिक्कत..
लैंडिंग गियर बाहर निकला..
पायलट सुरक्षित..#Maharashtra pic.twitter.com/h0htbhvztm
— Vivek Gupta (@imvivekgupta) August 9, 2025
