Trainee aircraft crash:: మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకాలో గల కడ్బన్‌వాడి గ్రామంలో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఒక ట్రైనీ విమానం వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. కార్వర్ ఏవియేషన్‌కు చెందిన సింగిల్ సీటర్ విమానం పుణె జిల్లాలో ఈరోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ శిక్షణలో ఉన్న 22 ఏళ్ల భావికా రాఠోడ్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ఫ్లైట్ ఎవరూ లేని మైదానంలో కూలిపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
భావికా రాఠోడ్ సింగిల్ సీటర్ విమానంలో పుణెలోని బారామతి విమానాశ్రయంలో ఒంటరిగా బయలుదేరింది. సాంకేతిక లోపం కారణంగా ఇందాపూర్ తాలూకాలోని గల కడ్బన్‌వాడి గ్రామంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. విమానం కూలిపోవడంతో గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ శబ్ధానికి స్థానికులు విమానం కూలిన చోటుకి పరుగులు తీశారు. ప్రమాదంలో గాయపడని ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. విమానం కూలిన తర్వాతే దెబ్బతిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
Bus Falls into River: ఘోరప్రమాదం.. నదిలో పడిన బస్సు, 24 మంది మృతి
జనవరిలో కూడా బిహార్‌లోని గయాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. విమానంలోని పైలట్లిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ అధికారులు తెలిపారు.
