Site icon NTV Telugu

Tamil Nadu: ఘోర విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రైన్.. ముగ్గురు విద్యార్థుల మృతి

Trianaccident

Trianaccident

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ తుక్కుతుక్కు అయిపోయింది. ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం ఉదయం కడలూరులోని సెమ్మన్‌ కుప్పం దగ్గర ఈ ఘటన జరిగింది.

ఇది కూడా చదవండి: Nagarjuna : తమిళ రీమేక్‌పై కన్నేసిన నాగ్.. 100వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?

గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. రైలు వస్తున్న సమాచారం తెలిసి కూడా రైల్వే గేటు మూయకుండా నిద్రపోయాడు. రైలు రావడం లేదేమో అనుకుని స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతోంది. కానీ ఇంతలోనే ట్రైన్ వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్‌ను ఈడ్చుకుపోయింది. ఇక గేట్ కీపర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు చితకబాదారు.

ఇది కూడా చదవండి: HBD Sourav Ganguly: డేరింగ్ కేర్ ఆఫ్ సౌరవ్ గంగూలీ.. టీమిండియా తలరాతనే మార్చిన బెంగాల్ టైగర్..!

Exit mobile version