Site icon NTV Telugu

Maharashtra: రైలుని పట్టాలు తప్పించే కుట్ర.. తప్పిన పెను ప్రమాదం..

Train Accident

Train Accident

Maharashtra: పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియన వ్యక్తుల రైలుని పట్టాలను తప్పించేందుకు కుట్ర పన్నారు. ఈ ఘటన శుక్రవారం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూణే-ముంబై రైల్వే ట్రాకుపై పెద్ద బండరాళ్లను రైల్వే అధికారులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉద్దేశపూర్వకంగా దుండగులు రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారని రైల్వే అధికారులు చెప్పారు.

Read Also: Peegate Incident: తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన.. రైలులో ఘటన..

రైల్వే సిబ్బంది ట్రాకును పరిశీలిస్తుండగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం ఇలాగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వెళ్లే మార్గంలో ట్రాకుపై బండరాళ్లు, ఇనుప కడ్డీలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్‌పూర్-జైపూర్ మార్గంలో వందే భారత్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో, ట్రాకుపై బండరాళ్లు పెట్టి ఉండటాన్ని గమనించిన లోకో పైలెట్ రైలును ఆపేశాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజాగా ఈ రోజు మహారాష్ట్ర జరిగింది.

Exit mobile version