NTV Telugu Site icon

Delhi: తుపాకీ గురి పెట్టి టయోటా ఫార్చ్యూనర్ కార్ దొంగతనం.. వైరల్ వీడియో..

Toyota Fortuner Car Stolen At Gunpoint

Toyota Fortuner Car Stolen At Gunpoint

Toyota Fortuner car stolen at gunpoint: నడిరోడ్డుపై గన్ పాయింట్ లో ఓ వ్యక్తి తన టయోటా ఫార్చ్యూనర్ కారును కోల్పోయాడు. దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు యజమానికి గన్ గురిపెట్టి కారును ఎత్తుకెళ్లారు. నైరుతి ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో గన్ గురిపెట్టి 35 ఏళ్ల వ్యక్తి నుంచి కారును దొంగిలించారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

శనివారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ కు ఝరేరా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారి-8పై ఈ దోపిడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఎరుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి కారు యజమానిని గన్ తో బెదిరించడం కెమెరాల్లో రికార్డ్ అయింది. కార్ యజమాని దగ్గర నుంచి కార్ తాళాలు తీసుకుని అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పరారయ్యారు.

Read Also: Venkatesh Netha: బీజేపీ డ్రామాల పార్టీ.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు

యూపీలోని మీరట్ జిల్లాకు చెందిన రాహుల్ అనే వ్యక్తికి సంబంధించిన ఫార్చ్యూనర్ కారును ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి టయోటా ఫార్య్చూనర్ ను దోచుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు నిందితులపై సెక్షన్ 397 (దోపిడీ, లేదా దోపిడీ, హత్య, గాయపరిచే ప్రయత్నం), ఐపీసీ 34 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.