NTV Telugu Site icon

Total Lunar Eclipse 2022: ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం.. “బ్లడ్ మూన్”గా దర్శనం ఇవ్వనున్న చంద్రుడు

Total Uunar Eclipse

Total Uunar Eclipse

Total Lunar Eclipse 2022: వరసగా కొన్ని వారాల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలు దర్శనం ఇస్తున్నాయి. గత నెల చివరి వారంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడగా.. నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. భూమి ఛాయలోకి చంద్రులు రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సారి గ్రహణ సమయంలో చంద్రుడు నెత్తురు రంగులో ‘బ్లడ్ మూన్’గా దర్శనం ఇవ్వనున్నాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడంతో కొంత సమయం పాటు చంద్రుడు భూమి నీడలోకి వెళ్లడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

Read Also: India at UNSC: రష్యాకు షాక్.. ఉక్రెయిన్‌పై తీర్మానానికి భారత్ దూరం..

ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో చాలా భాగం, ఫసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ తో సహా పలు ఆసియా దేశాల్లో ఈ చంద్రగ్రహాణాన్ని వీక్షించవచ్చు. నవంబర్ తెల్లవారుజామున చంద్రుడు గ్రహణ సమయంలో ఎరుపు రంగులోకి మారడాన్ని చూడవచ్చు. ఇప్పుడు ఈ గ్రహణాన్ని మిస్ అయితే.. మళ్లీ మార్చి 2025 వరకు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడలేం. నవంబర్ లో వివిధ దేశాల కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభం అయి సాయంత్రం 6.19 నిమిషాలకు ముగుస్తుంది. భారత్ లో 5.32 గంటలకు ప్రారంభమై 6.18 వరకు 46 నిమిషాల పాటు గ్రహణం దర్శనమిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో గ్రహనాన్ని వీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు, కోల్ కతా నగరంలో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పూర్తిస్థాయిలో వీక్షించవచ్చు.

గ్రహణ సమయంలో చంద్రుడి కాంతి చాలా వరకు తగ్గిపోవడంతో ఆకాశంలో నక్షత్రాలు, సౌరకుటుంబంలోని ఇతర గ్రహాలను మరింతగా చూసే అవకాశం ఏర్పడనుంది. ఈ సారి చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు బ్లడ్ మూన్ గా కనిపిస్తాడు. చంద్రగ్రహనం సమయంలో భూమిపై పడే సూర్యకాంతిలో కొంత భాగాన్ని భూ వాతవరణం వక్రీభవనం చేస్తుంది. ఈ కాంతి చంద్రుడుపై పడి ఎర్రని కాంతిని వెదజల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఇంత సుదీర్ఘ సమయం చంద్రగ్రహణం ఏర్పడటం గత 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటసారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే చంద్రుడు ఎరుపు రంగులోకి మారే అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉందని తెలిపారు.

Show comments