NTPC: తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను.. నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈనేపథ్యంలో.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రామగుండంలోని 100మెగావాట్ల ప్రాజెక్టుతో పాటు కేరళలోని కాయంకుళం 92మెగావాట్ల ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో నేడు దేశానికి అంకితం చేయనున్నారు. వర్చువల్ గా జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీ నుంచి వర్చువల్ మోడ్ ద్వారా ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. వీటితోపాటు రాజస్థాన్‌లో 735 మెగావాట్ల నోఖ్ సోలార్ ప్రాజెక్టు, గుజరాత్ కావస్, లేహ్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.
Corona Updates : తెలంగాణలో కరోనా విజృంభణ.. వెయ్యికి చేరువలో కొత్త కేసులు
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
నేడు.. రామగుండం ఎన్టీపీసీలో రూ.423కోట్లతో నిర్మించిన 100-మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ పూర్తి అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణ అనుకూలంగా నిర్మించారు. అయితే.. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు భూసేకరణ ఇతరత్రా అదనపు ఖర్చులు లేకపోవడంతో శరవేగంగా నిర్మాణ పనిని పూర్తి చేశారు. దీంతో.. సోలార్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. కాగా.. ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డు వరకు 33కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్‌ను తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ఈనేపథ్యంలో.. ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, హెచ్‌టి ప్యానెల్, పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సేకరణతో సహా అన్ని ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ఫ్లోటింగ్ ఫెర్రో సిమెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అని అధికారులు వివరించారు. అయితే.. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్టుగా పేరొందిందని అధికారులు తెలిపారు.
Triple Talaq : భార్య ప్రధాని మోడీ అభిమాని.. తలాక్ చెప్పిన భర్త..
తాజావార్తలు
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!