NTV Telugu Site icon

Haryana Polls: రేపే హర్యానా పోలింగ్.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రసవత్తర పోరు

Haryanapolls

Haryanapolls

దేశంలో శనివారం మరో రసవత్తర పోరుకు హర్యానా రాష్ట్రం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశ ప్రజల చూపు హర్యానాపై ఫోకస్ మళ్లింది. ఇక్కడ కాంగ్రెస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో సెప్టెంబర్ 5(శనివారం) పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తీసుకుని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి: TTD: ఎటువంటి అపచారం జరగలేదు.. వదంతులను నమ్మకండి..

హర్యానాలో కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. మరొకసారి అధికారం కోసం బీజేపీ కృషి చేయగా.. అధికారం ఛేజిక్కించుకోవాలని కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నం చేసింది. అలాగే ఆప్ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కొన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి ముఖ్యమైన నేతలంతా ప్రచారంలో దూసుకుపోయారు. రెండు పార్టీలు కూడా మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇక భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డారు.

ఇది కూడా చదవండి: Amazon Sale: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీగా తగ్గింపు.. సగం ధరకే కొనేయచ్చు

ఇక హర్యానా ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్స్ పోల్స్ విడుదల కానున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతలగా పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. ఇక్కడ భారీగానే ఓటింగ్ నమోదైంది. శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మరీ ఈసారి ప్రజలు ఎవరికీ అధికారం కట్టబెట్టనున్నారో చూడాలి.