
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న టీకాలను వేగవంతం చేశారు. టీకాలను వేగంగా అందిస్తూ కరోనా కట్టడి చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే, టీకాలపై అవగాహన కలిగిస్తూనే కొన్ని చోట్ల టీకా తీసుకున్న వారికి కొన్ని రకాల గిఫ్ట్ లు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ మున్సిపాలిటీ వినూత్న నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకునే వారికి ఉచితంగా టమోటాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజాపూర్ మున్సిపాలిటీ పేర్కొన్నది. రైతుల నుంచి టమోటాలను సేకరించి టీకా తీసుకున్నవారికి పంచుతున్నామని బీజాపూర్ మున్సిపాలిటీ ప్రకటించింది.