Site icon NTV Telugu

Toll Tax: తప్పుడు ప్రచారం.. టూవీలర్లకు ‘‘టోల్ ట్యాక్స్’’పై నితిన్ గడ్కరీ క్లారిటీ..

Toll Tax

Toll Tax

Toll Tax: జూలై 15 నుండి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు టోల్ చెల్లించాల్సి ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. పలు మీడియా నివేదికలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఊహాగానాలను గురువారం ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నివేదికలు తప్పుదాడి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.

Read Also: Alimony: ‘నా భార్య నెలకు రూ. 25 వేలు సంపాదిస్తుంది.. నేను భరణం చెల్లించను’.. హైకోర్టు సంచలన తీర్పు!

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘‘ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించబడుతుందని కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. అలాంటి నిర్ణయం ప్రతిపాదించబడలేదు.’’ అని చెప్పారు. ‘‘ద్విచక్ర వాహనాలకు టోల్ నుండి మినహాయింపు కొనసాగుతుంది. వాస్తవాలను ధృవీకరించకుండా ఇటువంటి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయడం బాధ్యతాయుతమైన జర్నలిజం కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని కేంద్రమంత్రి అన్నారు.

అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల్లో టూవీలర్స్ త్వరలో టోల్ చెల్లింపు తప్పనిసరి చేయబడుతుందని, తమ ద్విచక్ర వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసుకోవాలని కొన్ని మీడియాలు నివేదించిన తర్వాత, కేంద్ర మంత్రి నుంచి స్పష్టత వచ్చింది. ఇదే కాకుండా నేషనల్ హైవేస్‌పై టోల్ ఉల్లంఘించిన వారు రూ. 2000 వరకు జరిమానాఎదుర్కోవాల్సి ఉంటుందనే తప్పుడు ప్రచారం వ్యాపించింది. నితిన్ గడ్కరీ వివరణతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

Exit mobile version