NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* తెలంగాణలో పార్టీ పటిష్టతపై బీజేపీ ఫోకస్.. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

*సత్యసాయి యూనివర్సిటీ 41 వ స్నాతకోత్సవ వేడుకలు.. వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్

*ఏపీ హైకోర్టులో ఇవాళ మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ… పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో చిత్తూరు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్ జిల్లా కోర్టు రద్దు చెయ్యడంపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాది.

*శ్రీ సత్య సాయి బాబా 97వ జయంతి సందర్భంగా నేటి నుంచి ధర్మవరం నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సు సర్వీసులు.

*శ్రీకాకుళం రూరల్ మండలం, ఇప్పిలి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ‌

*నేడు విజయనగరం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న మంత్రులు రాజన్నదొర, బొత్స సత్యనారాయణ

*నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా.. బకాయిపడిన పీఎఫ్, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్

*శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షికి చేరుకోనున్న విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన స్వధర్మ వాహిని ప్రచార యాత్ర… శ్రీ దుర్గాపాసన, విశ్వేశ్వర, వీరభద్ర స్వామి దేవాలయంను సందర్శించనున్న స్వాత్మానందేంద్ర స్వామి

* సిట్ ముందుకి మరోసారి విచారణకు హాజరుకానున్న అడ్వకేట్ శ్రీనివాస్.. ఆయన సమాచారంతో బీజేపీ కీలక నేతలకు నోటీసులు ఇవ్వనున్న సిట్

*విశాఖలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన….సింహాద్రి ఎన్. టి.పి.సి.ని సందర్శించనున్న మంత్రి కిషన్ రెడ్డి

*నేడు రామచంద్రపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి వేణు

*నేడు తునిలో గడప గడప కి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా