తమిళనాడు కరోనాతో వణికిపోతోంది. తమిళనాడులో కరోనా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 23) నాడు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లాక్ డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులకు వెళ్లే ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు నమోదయ్యాయి.కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది.
కరోనా కేసులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేశాయి. దేశంలో కొత్త కేసుల సంఖ్య 3,47,254గా ఉంది. కరోనా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనవరి ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది.
తెలంగాణాలో రోజుకు నాలుగువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఇద్దరు మృతి.దేశంలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 9,692కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.