తమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ పార్టీ సభ్యురాలితో అసభ్యకరంగా వీడియో కాల్ చాటింగ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యంగా విడీయో కాల్ మాట్లాడిని రాఘవన్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. వీడియో కాల్ అంశం ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో పెద్ద దుమారం రేపుతున్నది. బయటే కాదు, బీజేపీ వంటి జాతీయ పార్టీలో కూడా మహిళలకు రక్షణ లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అది తన వీడియో కాల్ కాదని రాఘవన్ చెప్పడం విశేషం. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read: ఇండియాలో మళ్లీ లాంచ్ కాబోతున్న కైనెటిక్ లూనా…ఎలక్ట్రిక్ ఫీచర్లతో…
