Site icon NTV Telugu

Lok sabha: రుజువుందా? ఈ-సిగరెట్ వివాదంపై టీఎంసీ నిలదీత

Loksabha

Loksabha

లోక్‌సభలో ప్రస్తుతం ఈ-సిగరెట్ వివాదం నడుస్తోంది. గురువారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. పేరు ప్రస్తావించకుండా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఈ-సిగరెట్ తాగుతున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను అనురాగ్ ఠాకూర్ కోరారు. ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటానని చెప్పడంతో శుక్రవారం అధికారికంగా బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: Vinesh Phogat: సంచలన నిర్ణయం తీసుకున్న వినేష్ ఫోగట్.. ఎక్స్‌లో కీలక పోస్ట్

తాజాగా ఇదే అంశంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఈ-సిగరెట్ ఆరోపణలపై ఏవైనా ఆధారాలుంటే స్పీకర్‌కు సమర్పించాలని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. ఎంపీ పేరుతో పాటు ఈ-సిగరెట్ తాగినట్లుగా ఉన్న ఆధారాలు సమర్పించాలని కోరారు. ఏవైనా ఆధారాలు ఉంటే వెంటనే స్పీకర్‌కు సమర్పించాలి.. లేదంటే ఆరోపణలు చేయకూడదన్నారు. అనవసరమైన ఆరోపణలకు పార్లమెంట్‌ను వేదికగా ఉపయోగించుకోవద్దని తెలిపారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar: ఎమ్మెల్యేలకు డీకే.శివకుమార్ విందు.. ఏం జరుగుతోంది!?

అయితే పార్లమెంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్‌కు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. పార్లమెంట్ కాంప్లెక్స్ దగ్గర ధూమపానం చేస్తున్నట్లుగా కనిపించింది. వీడియోలో తేదీ కనిపించలేదు. ఇదిలా ఉంటే బీజేపీ ఫిర్యాదులో సౌగతా రాయ్‌ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఒక ఎంపీ ఈ-సిగరెట్ తాగుతున్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు.

అనురాగ్ ఠాకూర్ శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సభలో టీఎంసీ సభ్యుడు ఈ-సిగరెట్ తాగడం చూసినట్లు పేర్కొన్నారు. నిషేధిత ప్రాంతంలో మర్యాద లేకుండా ప్రవర్తించారని.. క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని.. నేరంగా పరిగణించాలని ఫిర్యాదు చేశారు.

Exit mobile version