ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బికేయూ) నేత రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్ గ్రౌండ్‌లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న చింతన్ శివిర్‌లో పాల్గనేందుకు మాగ్ మేళాకు వచ్చిన తికాయిత్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు.
Read Also: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతునివ్వాలంటూ బికేయూ ప్రెసిడెంట్ నరేష్ టికాయిత్ కోరిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అయితే.. సిసౌలిలో బీజేపీకి చెందిన సంజీవ్ బల్యాన్‌తో సమావేశమైన కొన్ని గంటల తర్వాత నరేష్ టికాయిత్ తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాశంగా మారింది. ఆప్‌కు మద్దుతు ఉంటుందని భావించిన టికాయత్ ప్రకటనతో అసలు ఏ పార్టీతో పొత్తుకు పోరని తెలుస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీకేయూ సిద్ధమైనట్టు టికాయత్ ప్రకటనను బట్టి తెలుస్తోంది. రైతుల్లో తమకున్న మద్దుతోనే ఎన్నికల్లో గెలవాలని బీకేయూ భావిస్తోందని, టికాయత్ మాటలతో ఈ విషయం రుజువైందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
